Rahul Sipligunj : నేను రాజకీయాల్లోకి రాను.. నేను ఎమ్మెల్యేగా పోటీ చెయ్యట్లేదు

తెలంగాణ(Telangana) ఎలక్షన్స్ రానున్న నేపథ్యంలో ఎన్నికల హడావిడి అప్పుడే మొదలైంది. ఈ నేపథ్యంలో రాహుల్ సిప్లిగంజ్ తను ఉండే ఏరియా గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని వార్తలు వస్తున్నాయి.

Rahul Sipligunj : నేను రాజకీయాల్లోకి రాను.. నేను ఎమ్మెల్యేగా పోటీ చెయ్యట్లేదు

Rahul Sipliganj denied the news that he contested as MLA from Goshamahal

Rahul Sipligunj :  హైదరాబాద్(Hyderabad) లోని ఒక గల్లీలో పుట్టి బార్బర్ గా పనిచేసుకుంటూ మ్యూజిక్ నేర్చుకొని సింగర్(Singer) గా ప్రైవేట్ ఆల్బమ్స్ తో మొదలుపెట్టిన రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్(Oscar) స్టేజిపై పెర్ఫార్మ్ చేసే రేంజ్ కి ఎదిగాడు. రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తుతం సింగర్ గా, ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఆన్నాడు. బయట ఈవెంట్స్ లో కూడా పాల్గొంటాడు. అయితే రాహుల్ ఏ రాజకీయ నాయకుడు పిలిచినా వెళ్లి మాట్లాడతాడు. తన ఇంట్లో జరిగే ఈవెంట్స్ కి పలువురు నాయకులని పిలుస్తాడు. అన్ని పార్టీల నేతలతో మంచి సంబంధాలు ఏర్పరుచుకున్నాడు రాహుల్.

తెలంగాణ(Telangana) ఎలక్షన్స్ రానున్న నేపథ్యంలో ఎన్నికల హడావిడి అప్పుడే మొదలైంది. ఈ నేపథ్యంలో రాహుల్ సిప్లిగంజ్ తను ఉండే ఏరియా గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై రాహుల్ సిప్లిగంజ్ స్పందించాడు. తను రాజకీయాల్లోకి వస్తున్నట్టు, గోషామహల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు వస్తున్న వార్తలని ఖండిస్తూ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.

OG Teaser : అర్జున్ దాస్ వాయిస్ ఓవర్‌తో పవన్ OG టీజర్.. పవన్ బర్త్‌డే రోజు గూస్ బంప్స్ రావాల్సిందే..

రాహుల్ సిప్లిగంజ్ తన పోస్ట్ లో.. నేను పాలిటిక్స్ లోకి రావట్లేదు. నా మీద చాలా రూమర్స్ వస్తున్నాయి, నేను గోషామహల్ ఎమ్మెల్యేగా పోటీచేస్తానని. ఆ వార్తలన్నీ అబద్ధం. అన్ని పార్టీలకి చెందిన మన లీడర్స్ అందరిని నేను గౌరవిస్తాను. నేను ఒక మ్యుజిషియన్, ఆర్టిస్ట్ మాత్రమే. నా జీవితం అంతా కూడా నేను ఇదే. నా ఫీల్డ్ లో నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ప్రస్తుతానికి నా కెరీర్ పైనే నేను ఫోకస్ చేశాను. నాకు ఏ పార్టీ నుంచి ఎలాంటి ఆఫర్ రాలేదు. ఇలాంటి వార్తలు ఇకనైనా ఆపండి అని తెలిపాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇటీవల రాహుల్ సిప్లిగంజ్ సోదరుని వివాహానికి అన్ని పార్టీలకు చెందిన టాప్ లీడర్లు వచ్చిన సంగతి తెలిసిందే.